Chinese gang arrested for cheating in investments: వివిధ రకాల పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కీలక నిందితులను తెలంగాణలోని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. దిల్లీలో నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీతో పాటు పలు రకాల పెట్టుబడులు పేరుతో సెల్ఫోన్లకు సందేశాలు పంపుతున్న నిందితులు.. స్పందించిన వారికి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నారు. అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడి పెట్టిస్తున్నారు.
వచ్చిన లాభాలను నేరగాళ్లు వ్యాలెట్లో చూపిస్తున్నారు. నమ్మిన తర్వాత ప్రజలు అధిక మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అనంతరం యాప్ ను డిలీట్ చేస్తున్నారు. ఇలా అధిక లాభాల కోసం పెట్టుబడి పెట్టి వారిని సైబర్ నేరగాళ్ళు దోచుకుంటున్నారు. ఈ సొమ్మంతా చైనాకు వెళతున్నట్లు పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. వాయిస్ ఓవర్.. నిందితులు డిల్లిలో ఉన్నట్లు తెసుకున్న పోలీసులు.. ప్రత్యేక సైబర్ క్రైం పోలీసు బృందం అక్కడికి వెళ్లి 5గురు డిల్లీ వాసులును గుర్తించి పట్టుకున్నారు.