Chinese Ambassador letter to cbn : తెదేపా అధినేత చంద్రబాబుకు భారత్‌లోని చైనా రాయబారి సున్ వెయిడాంగ్ లేఖ రాశారు. కరోనా నుంచి చంద్రబాబు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిచారు. ఆర్యోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తనకు కొవిడ్ స్వల్ప లక్షణాలు ఉన్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ట్వీట్ చేసిన చంద్రబాబు.. కరోనా నిర్ధరణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో హోంఐసోలేషన్‌లో ఉన్న బాబు.. ఇటీవల కాలంలో తనను కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు ఆయన కుమారుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు సోమవారం కొవిడ్ నిర్ధరణ అయిన విషయం తెలిసిందే.