ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ధూళిపాళ్ల నరేంద్రకు మెరుగైన వైద్యం అందించాలి'

By

Published : May 4, 2021, 2:38 PM IST

అస్వస్థతకు గురైన తమ పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకు మెరుగైన వైద్యం అందించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిలదీసినందుకే... కక్ష పూరితంగా నరేంద్రను అరెస్ట్ చేశారని ఆరోపించారు.

చినరాజప్ప
చినరాజప్ప

అస్వస్థతకు గురై జర్వం, దగ్గుతో బాధపడుతున్న ధూళిపాళ్ల నరేంద్రకు మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆస్పత్రిలో చికిత్స అందించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప కోరారు. నరేంద్ర అరెస్ట్ ప్రభుత్వ పిరికిపంద చర్య అన్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిలదీసినందుకే... కక్షపూరితంగా నరేంద్రను అరెస్ట్ చేశారని ఆరోపించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details