తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 7.82 లక్షల గృహ నిర్మాణాలు పూర్తయ్యాయని శాసనసభ సాక్షిగా వైకాపా ప్రభుత్వమే వెల్లడించిందని తెలుగుదేశం సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో గృహ నిర్మాణాలు పూర్తి కాలేదని ఏ 2 ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఏ2 ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారు : చినరాజప్ప
తెదేపా హయాంతో 7.82 లక్షల గృహాలు నిర్మించారని అసెంబ్లీలో వైకాపా ప్రభుత్వమే చెప్పిందని తెదేపా సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఏ2 ప్రజలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురం, తాడేపల్లి గత ప్రభుత్వం కట్టిన గృహాలు కనిపించలేదా అని ప్రశ్నించారు.
చినరాజప్ప
నెల్లూరు జిల్లా పెన్నానది ఒడ్డున వెంకటేశ్వరపురంలో 4800, తాడేపల్లిలో 5024 ఇళ్లు గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయని...ఈ ఇళ్లు వీరికి కనిపించడం లేదా అని చినరాజప్ప ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 6వేల ఎకరాలను బలవంతంగా లాక్కొని.... 8 వేల కోట్ల ప్రజాధనంలో సగానికి సంగం తినేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి :తెదేపా కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌కాల్.. ఎందుకంటే?!