కరోనా వైరస్ నియంత్రణకు ప్రాణాలొడ్డి పోరాడుతున్న వైద్యులకు రక్షణ సౌకర్యాలు కల్పించాలని... తెలుగుదేశం నేత నిమ్మకాయల చినరాజప్ప ప్రభుత్వానికి సూచించారు. రక్షణ పరికరాల కొరత ఉందని ప్రశ్నించిన విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడిని సస్పెండ్ చేయడం దారుణమన్న ఆయన... ఈ ఘటన వైద్యుల్లో అభద్రతా భావాన్ని పెంచుతుందన్నారు. వెంటనే సుధాకర్‌రావు సస్పెండ్‌ను రద్దుచేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలన్న చినరాజప్ప.... ఇప్పటికైనా వైద్యుల రక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
రక్షణ పరికరాల కొరత ఉందని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా..? - ఏపీలో కరోనా కేసుల వివరాలు
కరోనా మహమ్మారి నియంత్రణకు పోరాడుతున్న వైద్యులకు రక్షణ సౌకర్యాలు కల్పించాలని తెదేపా నేత చినరాజప్ప ప్రభుత్వాన్ని కోరారు. రక్షణ పరికరాల కొరత ఉందని ప్రశ్నించిన విశాఖ జిల్లా నర్సీపట్నం వైద్యుడిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు.
chinarajappa-fire-on-government-for-suspend-doctor