ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయసాయికి దొంగ లెక్కలు తప్ప.. చరిత్ర ఏం తెలుసు? - Chinarajappa latest news

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి దొంగలెక్కలు రాయటం తప్ప.. చరిత్ర జ్ఞానం లేదని చినరాజప్ప దుయ్యబట్టారు.

chinarajappa
నిమ్మకాయల చినరాజప్ప

By

Published : Apr 3, 2021, 3:12 PM IST

విజయసాయిరెడ్డికి దొంగలెక్కలు రాయటం తప్ప.. చరిత్ర జ్ఞానం లేదని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. గతంలో అధికార పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా జయలలిత, జ్యోతిబసులు ఎన్నికల్ని బహిష్కరించి మళ్లీ సీఎంలు అయ్యారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా రెండేళ్లు అసెంబ్లీని, ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్ని బహిష్కరించిన విషయం మర్చిపోయారా అని నిలదీశారు.

అబద్దాలను ఆసరాగా చేసుకొని అధికార పీఠమెక్కిన వైకాపాకు ప్రజాస్వామ్య విలువలు ఎలా తెలుస్తాయని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బెదిరింపులు, దాడులు, అరాచకాలు, అక్రమ అరెస్టులు, హత్యలపర్వం కొనసాగిందని విమర్శించిన రాజప్ప..పరిషత్ ఎన్నికల్లోనూ దొంగ-పోలీసు ఒక్కటయ్యారని అందరికీ తెలుసని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details