ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రి గౌతమ్ రెడ్డితో చైనా పాల్స్ పుష్ సంస్థ ప్రతినిధులు భేటీ

By

Published : Oct 19, 2020, 10:28 PM IST

చైనాకు చెందిన బొమ్మల తయారీ సంస్థ పాల్స్ పుష్ ప్రతినిధులు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీలో టాయ్ మ్యానుఫాక్చరింగ్ బోర్డు ఏర్పాటు చేస్తే వ్యాణిజ్యం, పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందని మంత్రికి వివరించారు. రాష్ట్రంలో బొమ్మల తయారీ యూనిట్ ఏర్పాటుకు పాల్స్ పుష్ సంస్థ ఆసక్తిగా ఉందన్నారు.

minister goutam reddy
minister goutam reddy

చైనాకు చెందిన ఆటబొమ్మల తయారీ సంస్థ పాల్స్ పుష్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో భేటీ అయ్యారు. ఏపీలో బొమ్మల తయారీ యూనిట్​ ఏర్పాటు చేసేందుకు పాల్స్ పుష్ సంస్థ ఆసక్తిగా ఉందని మంత్రికి తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ టాయ్ మ్యానుఫాక్చరింగ్ బోర్డును ఏర్పాటు చేస్తే వాణిజ్యం, పెట్టుబడులకు అనువుగా ఉంటుందని మంత్రికి సూచించారు.

ఫ్యాబ్రిక్, స్ట్రిచ్చింగ్ వంటి వాటిలో ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉపాధి అవకాశాలుంటాయని చైనా ప్రతినిధులు తెలిపారు. చైనా నుంచి దిగుమతులపై ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఇక్కడే తయారీ చేయడానికి గల అవకాశాలపై మంత్రి మేకపాటి చర్చించారు. పెట్టుబడులు, ఉపాధి కల్పన అంశాలపై నివేదిక ఇవ్వాలని మంత్రి పాల్స్ పుష్ సంస్థ ప్రతినిధులను కోరారు.

ABOUT THE AUTHOR

...view details