రాష్ట్రంలో జలవనరుల శాఖ పని తీరు నానాటికీ దిగజారుతుందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. రాష్ట్ర ప్రజల జీవనాడీ పోలవరం ప్రాజెక్టు పనులు 72% పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అని చినరాజప్ప అన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గత 18 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి కృషి చేయలేదన్నారు. మంత్రి అనిల్ కుమార్కు జలవనరుల శాఖపై అవగాహన లేదని ఆరోపించారు. ఆకాల వర్షాలు, తుపానుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
'జలవనరుల శాఖ పని తీరు దిగజారుతోంది' - china rajappa fires on ysrcp government
జలవనరుల శాఖ పనితీరుపై మాజీ మంత్రి చినరాజప్ప మిమర్శలు గుప్పించారు. పని తీరు నానాటికీ దిగజారుతోందని దుయ్యబట్టారు. 18 నెలల్లో ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి కృషి చేయలేదని విమర్శించారు.
చినరాజప్ప