ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్ లో చైనాకు చెందిన ఆన్ లైన్ గేమింగ్ గ్యాంగ్ అరెస్ట్ - China online gaming gang arrested

ఆన్లైన్ గేమింగ్ నిషేధమని... ఎవరైనా ఆడితే పోలీసులకు తెలపాలని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్.. సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. కోట్ల రూపాయలు దండుకుంటున్న నలుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వివిధ బ్యాంకుల్లోని రూ.30కోట్లను సీజ్ చేశారు.

China online gaming gang arrested in Hyderabad
హైదరాబాద్ లో చైనాకు చెందిన ఆన్ లైన్ గేమింగ్ గ్యాంగ్ అరెస్ట్

By

Published : Aug 13, 2020, 8:10 PM IST

హైదరాబాద్ లో చైనాకు చెందిన ఆన్ లైన్ గేమింగ్ గ్యాంగ్ అరెస్ట్

చైనా కేంద్రంగా ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్న నలుగురు సభ్యుల ముఠాను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బ్యాంకు చెక్కు బుక్కులు, పాస్‌పుస్తకాలు, పలు దస్త్రాలతోపాటు చరవాణులు మూడు లాప్‌ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. వివిధ బ్యాంకుల్లోని 30కోట్ల రూపాయలను సీజ్ చేశారు. గురుగాం, దిల్లీ, ప్రాంతాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన చైనా సంస్ధలు ఆయా కంపెనీల ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వీరిలో కొందరు చైనాకు చెందిన సిబ్బందితోపాటు స్థానికులు కూడా పనిచేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.1,000కోట్లకు పైగానే ఈ సంస్ధల ద్వారా గేమింగ్ ఆడుతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరింత లోతైన విచారణ చేయనున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.

ఇదీ చూడండి :ప్రభుత్వాన్ని నమ్మండి.. ప్రతిపక్షాన్ని కాదు: బొత్స

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details