ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: చెరువులో మునిగి నలుగురు చిన్నారులు మృతి - latest crime news in mahabubabad district

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. శనగపురం శివారులోని చెరువులో మునిగి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

childrens-death-due-to-the-fall-in-lake-at-shanigapurama-in-mahabubabad
చెరువులో మునిగి నలుగురు చిన్నారులు మృతి

By

Published : Jul 4, 2020, 8:36 PM IST

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనగపురం శివారు తుమ్మల చెరువులో మునిగి నలుగురు బాలురు చనిపోయారు. వీరంతా సమీపంలోనున్న బోడ తండాకు చెందిన లోకేశ్​, ఆకాశ్​, దినేశ్​, జగన్​గా గుర్తించారు. వీరంతా 12 నుంచి 14 ఏళ్ల లోపు వయసున్న వారే. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ కాసేపు ఆడి.. ఈత కొట్టి... చేపలు పట్టేందుకు ఉపక్రమించారు.

చెరువులో మునిగి నలుగురు చిన్నారులు మృతి

చెరువులో గుంతలు ఉండడం వల్ల పిల్లలు దిగిన కాసేపటికే నీట మునిగి ప్రాణాలు వదిలారు. బయటకు వెళ్లిన పిల్లలు ఎంతకీ తిరిగిరాకపోవడం వల్ల తల్లిదండ్రులు వారి కోసం గాలింపు చేపట్టగా.. చెరువు వద్ద వారి బట్టలు, చెప్పులు కనిపించాయి. స్థానికులు సాయంతో చెరువు నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మహబూబాబాద్ డీఎస్పీ, సీఐ తదితరులు జరిగిన దుర్ఘటనపై వివరాలు సేకరించారు.

ఇదీచదవండి.

బావిలో పడిన శునకాన్ని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది

ABOUT THE AUTHOR

...view details