ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 5, 2021, 10:12 PM IST

ETV Bharat / city

Corona: గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు కరోనా సోకే అవకాశం..!

కరోనా.. తల్లి గర్భంలో ఉన్నప్పుడే గర్భస్థ శిశువులకు సోకుతుందా..? అంటే ఇప్పటి వరకు లేదనేది వైద్యుల మాట. అయితే ఇటీవల మాత్రం అప్పుడే పుట్టిన చిన్నారుల్లో యాంటీ బాడీలను గుర్తిస్తున్న వైద్యులు.. తల్లుల నుంచే పిల్లలకు వైరస్ సోకినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నియోనేటలాజిస్ట్ డాక్టర్ సతీష్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి రమ్య ముఖాముఖి.

Children may be exposed to corona while pregnant
గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు కరోనా సోకే అవకాశం..!


"తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉంది. నెలలు నిండిన శిశువుల్లో యాంటీబాడీస్‌ వచ్చే అవకాశం ఉంది. నెలలు నిండని శిశువులకు యాంటీబాడీస్‌ రావు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా 10-12 కేసులు ఉన్నాయి. మిస్సీ అనే వ్యాధి పిల్లల్లో ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటుంది. మిస్సీ వచ్చిన పిల్లలకు 4 నుంచి 6 వారాల క్రితమే కొవిడ్‌ సోకి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు ప్రస్తుతం మిస్సీ లక్షణాలు బయటపడుతున్నాయి.జ్వరం, దురద, కాళ్లు చేతులకు వాపులు, నాలుక ఎర్రబడటం, పెదాలు పగిలిపోవడం, విపరీతమైన కడుపునొప్పి మిస్సీ లక్షణాలు. వ్యాధి లక్షణాలు గుర్తించగానే వైద్యం చేయిస్తే త్వరగా బయటపడొచ్చు. మిస్సీ వ్యాధికి వైద్యం కూడా మూడు, నాలుగు రకాలుగా ఉంటుంది. ఎంత త్వరగా వ్యాధి లక్షణాలు గుర్తిస్తే అంతా త్వరగా నయం చేయొచ్చు."-నియోనేటలాజిస్ట్ డాక్టర్ సతీష్‌

గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు కరోనా సోకే అవకాశం..!

ABOUT THE AUTHOR

...view details