మూడు తరాలకు చెందిన నలుగురు కుటుంబసభ్యులను పొట్టనబెట్టుకున్న డెంగీ మహమ్మారిని 20 రోజుల పసికందు జయించి మృత్యుంజయుడయ్యాడు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలలో మహాలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పూర్తిగా ఆరోగ్యవంతునిగా బయటికొచ్చాడు. డెంగీ బారిన పడి మృతి చెందిన సోనీ, రాజా దంపతుల రెండో కుమారుడు గత 18 రోజులుగా రక్తకణాలు తగ్గి ప్రాణాలతో పోరాడాడు.
కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న డెంగీని జయించిన బుడ్డోడు - కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న డెంగీని జయించిన బుడ్డోడు
20 రోజుల పసికందు మృత్యువును ఓడించి గెలిచాడు. కోరలు చాచి తన వారిని మింగేసి తనదాకా వచ్చిన మహమ్మారిని... ఆ బుడ్డోడు జయించాడు. ఈ విజయంలో ఆ పసికందుకు ఆస్పత్రి వైద్యుడు చేయూతనిచ్చాడు. తెలంగాణలోని మంచిర్యాలలో డెంగీకి బలైన సోనీ, రాజా దంపతుల కుమారుడు పూర్తిగా కొలుకున్నాడు.

child-conquered-dengue-who-lost-3-generations-in-his-family
కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్న డెంగీని జయించిన బుడ్డోడు
పసివాడికి ప్రాణాలు పోసిన వైద్యుడు
డాక్టర్ కుమార్వర్మ పసివాడికి ప్రాణాలు పోశారు. నాలుగుసార్లు ప్లేట్లెట్లు... పలుమార్లు ఎఫ్బీ ఎక్కించారు. రూ.10 లక్షల ఖర్చును భరించి మానవత్వాన్ని చాటుకున్నారు. శిశువును బంధువులకు అప్పగించి చికిత్స వివరాలను వైద్యుడు కుమార్వర్మ వెల్లడించారు. చిన్నారికి తల్లినుంచి ఈ వ్యాధి సోకిందని... చాలా అరుదుగా ఇలా జరుగుతుందని తెలిపారు.
ఇదీ చూడండి : 40 ప్రేమ కథల 'కడలి'