ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రమాదం జరిగిన ఆసుపత్రి నిర్వాహకుడు తెదేపా నేతే: శ్రీకాంత్ రెడ్డి

విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి... 2 విచారణ కమిటీలను వేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పారు ఆస్పత్రి నిర్వాహకుడు, వైద్యుడు రమేష్ చౌదరి... తెదేపా నేతే అని స్పష్టం చేశారు. ఘటనపై పూర్తి స్థాయి నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Chief Whip Gadikota Srikanth Reddy
Chief Whip Gadikota Srikanth Reddy

By

Published : Aug 10, 2020, 4:52 PM IST

స్వర్ణా ప్యాలెస్ ఘటనలో ప్రభుత్వం తక్షణమే స్పందిచి 2 విచారణ కమిటీలను వేసిందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. హోటల్ ను తాత్కాలిక ఆస్పత్రిగా మార్చి కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యుడు రమేష్ చౌదరి తెదేపా నేతే అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేత చంద్రబాబు నిర్వహించిన జూమ్ సమావేశాల్లోనూ ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు.

కరోనా రోగులను దృష్టిలో పెట్టుకొని వైద్యానికి ప్రభుత్వం అనుమతినిస్తే ... కొన్ని ఆస్పత్రులు దుర్వినియోగం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. పాలన బాగోలేదని విమర్శలు చేసే రమేష్ చౌదరి.. కరోనా రోగుల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు. రమేష్ హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే 10 మంది చనిపోయారని ప్రాథమికంగా తేలిందని.. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక వచ్చాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

అవసరం లేదని చెప్పండి

మరోవైపు అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని వ్యాఖ్యానించిన ఆయన విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. వైకాపా ప్రభుత్వానికి ఏ ప్రాంతంపైనా దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయ రాజధాని అవసరం లేదని చంద్రబాబు, పవన్ లు రాయలసీమ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌ను ఎదుర్కొంటూ కోలుకుంటున్న దశలో మృత్యుఒడికి..

ABOUT THE AUTHOR

...view details