ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ'

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనుందని సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్​ ప్రకాశ్​ పీఎంవోకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 2022 నాటికి ప్రధానమంత్రి ఆవస్​ యోజన కింద ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి అనుమతి వచ్చాక పంపిణీ కార్యక్రమం చేపడతామని అన్నారు.

'30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ'
'30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ'

By

Published : Aug 9, 2020, 3:34 AM IST

2022 నాటికి అందరికీ సొంత ఇళ్లు ఉండాలని ప్రధాని నిర్దేశించిన కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ కార్యక్రమం చేపట్టిందని.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుందని సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్​ ప్రకాశ్​ తెలిపారు. ఈ మేరకు పీఎంవోకు రాసిన లేఖలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో రూ.20 వేల కోట్లు వెచ్చించి 62వేల ఎకరాలు సమీకరించాం. అందరికీ ఇళ్ల స్థలాలు అందించాక 30 లక్షల మంది లబ్దిదారులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2022 నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. ఈ విధంగా ప్రధాని నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంటుంది. కేంద్రం ఇప్పటికే 15 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. రాబోయే రెండేళ్లలో మరో 15 లక్షల ఇళ్లు మంజూరు చేయెుచ్చు. ఈ ఇళ్ల నిర్మాణంపై చేసే మూలధన వ్యయం రూ.లక్ష కోట్లు ఉంటుంది. లాక్‌డౌన్ అనంతర పరిస్థితుల్లో గ్రామీణ, ఓ మాదిరి పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకునేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుంది.

- ప్రవీణ్​ ప్రకాశ్​, సీఎం ముఖ్య కార్యదర్శి

సుప్రీంకోర్టు నుంచి అనుమతి వచ్చాక ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపడతామని ప్రవీణ్​ ప్రకాశ్​ తెలిపారు. అది వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి..

మూడు రాజధానులకు.. ఈ నెల 16న శంకుస్థాపన..?

ABOUT THE AUTHOR

...view details