సీనియర్ రెసిడెంట్ వైద్యుల ఉపకార వేతనాన్ని రూ.45 వేల నుంచి రూ.70వేలకు పెంచినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. వైద్య విద్యార్థులు ఉపకార వేతనం పెంపుతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని బుధవారం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సింఘాల్ మంగళగిరిలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉపకార వేతనం నుంచి ఆదాయపన్ను వసూలు చేయకుండా ఉండడం, పీజీ విద్యార్థులకు పరీక్షల నిర్వహణ గురించి ముందుగా తెలియజేయడం, ఇతర సమస్యలనూ వారంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో గురువారం నుంచి విధులకు హాజరవుతామని ఏపీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది. వారంలోగా హామీలు అమలుచేయకుంటే తిరిగి ఆందోళన కొనసాగించేందుకు వెనుకాడబోమని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.
15లోగా 8.76 లక్షల డోసుల రాక