ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రెమ్​డెసివిర్, ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి: సింఘాల్

కొవిడ్ కేర్ కేంద్రాల్లో రోగులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​లను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు. కరోనా నిర్ధారణ పరీక్షలను రోజుకు 30 వేల నుంచి 80 వేలకు పెంచామని తెలిపారు.

chief-secretary-of-health-department-anil-kumar-singhal
వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్

By

Published : Apr 29, 2021, 10:45 PM IST

కొవిడ్ కేర్ కేంద్రాల వద్ద రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్​లకు సూచించినట్లు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అస్పత్రుల్లో పడకల లభ్యత కోసం డిశ్చార్జ్​లపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,900 రెమ్​డెసివిర్ డోసులు అందుబాటులో ఉన్నాయని, 431 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉన్నట్లు సింఘాల్ వెల్లడించారు.

వెయ్యి పడకలను సిద్ధం చేసేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ అంగీకరించినట్లు అనిల్ కుమార్ తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ కూడా అక్కడ అందుబాటులో ఉందని, వెయ్యి పడకలకు ఆ ఆక్సిజన్ సరిపోతుందని వివరించారు. గతంలో కొవిడ్ చికిత్సకు రూ.3,250 ఫీజుగా నిర్ణయించామని, ఎన్ఏబిహెచ్ అక్రిడిషన్ ఉంటే రూ.14 వేలు ఫీజు సూచించినట్లు పేర్కొన్నారు. కరోనా నిర్ధరణ పరీక్షలను రోజుకు 30 వేల నుంచి 80 వేలకు పెంచామని, సాంకేతిక సిబ్బందిని అదనంగా నియమించి టెస్టుల రిపోర్ట్ లను వేగంగా అందిస్తామని సింఘాల్ స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

విద్యాపరమైన అంశాలపై మంత్రుల సమీక్ష

ABOUT THE AUTHOR

...view details