ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం దిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆయన కలవనున్నారని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమిత్ షా అపాయింట్మెంట్ విషయం ఆదివారం ఉదయం తెలుతుందని, దాన్ని బట్టే సీఎం పర్యటన ఖరారు కానుందని సమాచారం కొవిడ్ వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్రమే తీసుకోవాలని ముఖ్యమంత్రి ...హోమంత్రిని కోరే అవకాశం ఉందని తెలిసింది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సహకారాన్నీ కోరతారని సమాచారం.
Jagan Delhi Tour: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి జగన్?
18:30 June 05
కేంద్రమంత్రులతో భేటీ అయ్యే అవకాశం
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బిల్లులు, కొవిడ్ నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం వంటి అంశాలనూ ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చే సమయాన్ని బట్టి ఆయన్ను కలిశాక జగన్ ఇతర కేంద్ర మంత్రులను కలిసే అవకాశాలున్నాయి. ఆ మేరకు అవసరమైతే ఆయన సోమవారం రాత్రి దిల్లీలోనే బస చేసి మంగళవారం పర్యటన కొనసాగిస్తారు.
ఇదీ చదవండి
Jagan bail: జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశం.. అందుకే లేఖలు: నారాయణ