ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

KCR Meets Shekhawat: ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్​ పరిధిలోకి తేవాలి: కేసీఆర్ - కేంద్రమంత్రి షెకావత్‌తో సీఎం కేసీఆర్ భేటీ

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్​ (CM KCR) కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల కృష్ణాజలాల వివాదంపై (Krishna Water Dispute) చర్చించారు.

ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్​ పరిధిలోకి తేవాలి
ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్​ పరిధిలోకి తేవాలి

By

Published : Sep 25, 2021, 5:04 PM IST

ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్​ పరిధిలోకి తేవాలి

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్​ (CM KCR) కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై 40 నిమిషాల పాటు చర్చించారు. రాయలసీమ ఎత్తిపోతలతో పాలమూరుకు జరుగుతున్న నష్టాన్ని కేంద్రమంత్రికి కేసీఆర్ వివరించారు. తెలుగు రాష్ట్రాల కృష్ణాజలాల వివాదంపై (Krishna Water Dispute) చర్చించారు.

పాలమూరు-రంగారెడ్డికి అనుమతులు, నీటి కేటాయింపులు చేయాలని షెకావత్​ను కేసీఆర్ కోరారు. కేఆర్ఎంబీ (KRMB), జీఆర్ఎంబీ (GRMB) గెజిట్ అమలు తేదీ వాయిదా వేయాలని ప్రస్తావించారు. ఉమ్మడి ప్రాజెక్టులనే నోటిఫికేషన్ పరిధిలోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. పాలమూరు ప్రజాప్రతినిధులతో కలిసి షెకావత్‌ను కలిశారు.

శాంతిభద్రల దృష్ట్యా...

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానుండగా..ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే లేఖలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) పాల్గొనాల్సి ఉండగా..కాలు నొప్పి కారణంగా దిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. సీఎంకు బదులుగా హోంమంత్రి మేకతోటి సుచరిత(home minister sucharita) దిల్లీ వెళ్లనున్నారు. నిన్న ఉదయం వ్యాయామం చేస్తుండగా సీఎం జగన్ కాలు బెణికిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి :cm delhi tour cancel: సీఎం జగన్‌ దిల్లీ పర్యటన రద్దు.. ఎందుకంటే..

ABOUT THE AUTHOR

...view details