ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN REVIEW: శిశు మరణాల్ని తగ్గించాలి: జగన్​

CM jagan review
సీఎం జగన్​ సమీక్ష

By

Published : Sep 8, 2021, 3:03 PM IST

Updated : Sep 9, 2021, 5:35 AM IST

14:50 September 08

cm jagan review

 రాష్ట్రంలో శిశు మరణాల్ని తగ్గించాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ఫ్యామిలీ డాక్టర్‌ విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టి విధి విధానాల్ని ఖరారు చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటుచేస్తున్న వైద్య కళాశాలల్లో పీజీ కోర్సులూ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

 ‘ప్రజారోగ్యంపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. రక్తం, నీరు, గాలిపై విలేజ్‌ క్లినిక్‌ల స్థాయిలో పరీక్షలు జరపాలి. అవసరమైన చోట్ల సీహెచ్‌సీలలోనూ డయాలసిస్‌ యూనిట్లు ఏర్పాటుచేయాలి. ఎవరు ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆ వివరాలను నమోదుచేసి... వారికిచ్చే గుర్తింపు కార్డు ద్వారా ఆ సమాచారం ఎక్కడి నుంచైనా ఏ వైద్యుడైనా పరిశీలించే సౌకర్యం ఉండాలి. దీనికోసం సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. కరోనా మూడో దశ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో కొత్త చికిత్స విధానాలపై దృష్టి పెట్టాలి’ -జగన్, సీఎం 

 కేరళలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి అక్కడ పర్యటించిన అధికారుల బృందం... ముఖ్యమంత్రికి వివరించింది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తదితరులు పాల్గొన్నారు.

కరోనా నియంత్రణ, టీకాలపై సమావేశంలో అధికారులు చెప్పిన వివరాలు...

  •  రాష్ట్రంలో క్రియాశీల కొవిడ్‌ కేసులు- 14,452
  •  రికవరీ రేటు- 98.60%
  •  క్రియాశీల కేసులు లేని గ్రామ, వార్డు సచివాలయాల సంఖ్య- 10,494
  •  ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారు- 3,560
  •  కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఉన్న వారు- 926
  •  హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు- 9,966
  •  104 కాల్‌సెంటర్‌కి వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌- 684
  • ఫీవర్‌ సర్వే చేసింది- 18 సార్లు
  •  అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు- 20,964
  •  ఇంకా రావాల్సినవి- 2,493
  •  అందుబాటులోని డి-టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు- 27,311
  • ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ పనులు పూర్తయిన ఆసుపత్రులు- 108
  •  50, అంతకంటే ఎక్కువ పడకలు ఉన్న ఆసుపత్రుల్లో ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు- 140. అక్టోబరు 6 నాటికి మిగిలిన ఆసుపత్రుల్లోనూ అమరిక పూర్తి.
  •  టీకా ఒక డోసే వేసుకున్న వారు- 1,31,62,815
  • రెండు డోసులు వేసుకున్న వారు- 91,72,156

ఇదీ చదవండీ..Clash: తిరుపతిలో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు

Last Updated : Sep 9, 2021, 5:35 AM IST

ABOUT THE AUTHOR

...view details