ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP CM letter to All CMs: 'కరోనా టీకాల సరఫరాపై ఒకే గొంతుక వినిపిద్దాం' - Andhra News

అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ముఖ్యమంత్రి జగన్
అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ముఖ్యమంత్రి జగన్

By

Published : Jun 3, 2021, 7:33 PM IST

Updated : Jun 3, 2021, 8:22 PM IST

19:30 June 03

అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసిన ముఖ్యమంత్రి జగన్

అన్ని రాష్ట్రాల సీఎంలకు ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) లేఖలు రాశారు. కరోనా టీకాల (vaccine) సరఫరాపై ఒకే గొంతుక వినిపించాలని కోరారు. గ్లోబల్ టెండర్లు (Global Tenders) పిలిచినా ఒక్కరూ బిడ్ వేయలేదని లేఖల్లో పేర్కొన్న జగన్‌... గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని లేఖల్లో ప్రస్తావించారు. వ్యాక్సిన్ (vaccine) లభ్యతపై కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం వచ్చేలా ఉందన్న జగన్... వ్యాక్సిన్ సరఫరాలో రాష్ట్రాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని వ్యాఖ్యానించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రమే పూర్తిగా చేపట్టాలని అందరమూ కోరదామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రతిపాదించారు. వ్యాక్సినేషన్ వేగంగా జరగకుంటే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ లభ్యత పెంచుకోవడం దేశ తక్షణ అవసరమని లేఖలో అభిప్రాయపడ్డారు. 

ఇదీ చదవండీ... Jagananna house: రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం: సీఎం జగన్‌

Last Updated : Jun 3, 2021, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details