ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల ప్రయోజనాలే కేంద్రానికి ముఖ్యం: పురందేశ్వరి - భాజపా నేత పురందేశ్వరి తాజా వార్తలు

రైతుల ప్రయోజనాలే కేంద్రానికి ముఖ్యమని భాజపా నేత పురందేశ్వరి అన్నారు. ఛత్తీస్​గడ్ రాష్ట్ర ఇంఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన ఆమె...తొలిసారిగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతూ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్​తో పాటు విపక్ష పార్టీలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు.

chhattisgarh bjp state incharge daggubati purandeswari
chhattisgarh bjp state incharge daggubati purandeswari

By

Published : Dec 8, 2020, 9:26 PM IST

రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని భాజపా నాయకురాలు, ఛత్తీస్​గడ్ రాష్ట్ర భాజపా ఇన్​ఛార్జ్ పురంధేశ్వరి అన్నారు. బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఛత్తీస్​గడ్​లో పర్యటిస్తున్న ఆమె... రెండ్రోజులుగా నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.... వెనుకబడిన తరగతులతో పాటు...అణగారిన వర్గాల ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ప్రజల్లో భాజపాపై నమ్మకం ఉన్నందునే రెండుసార్లు అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. నూతన వ్యవసాయ చట్టాలతో దేశ వాణిజ్య రంగం మరింత బలోపేతం అవుతుందన్నారు. మధ్యవర్తులను తొలగించటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యమని చెప్పారు. కాంగ్రెస్​తో పాటు విపక్ష పార్టీలు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని విమర్శించారు. గడిచిన ఏడాది కాలంలో ఛత్తీస్​గడ్​లో 234 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details