ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ranjith reddy On Botsa comments: బొత్సకు అదిరిపోయే కౌంటర్​ ఇచ్చిన తెలంగాణ ఎంపీ రంజిత్‌రెడ్డి - బొత్సకు అదిరిపోయే కౌంటర్

Ranjith reddy On Botsa comments: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్​గా మారాయి. ఏపీలో నీళ్లు, కరెంట్ లేవన్న ఆయన మాటలు నేతల మధ్య పొలిటికల్ హీట్ పెంచాయి. హైదరాబాద్​లో విద్యుత్ లేదన్న ఏపీ మంత్రి బొత్సకు తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నాడంటే?

మాట్లాడుతున్న  రంజిత్‌రెడ్డి
మాట్లాడుతున్న రంజిత్‌రెడ్డి

By

Published : Apr 29, 2022, 6:28 PM IST

Ranjith reddy On Botsa comments: ఏపీలో నీళ్లు, కరెంట్ లేవన్న కేటీఆర్ వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఏపీలో అధికార వైకాపా నేతలు.. తమదైన శైలిలో తెరాసపై విరుచుకుపడుతున్నారు. హైదరాబాద్​లో కరెంట్ లేదన్న ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు తెలంగాణ ఎంపీ రంజిత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బొత్స కరెంట్ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసి ఉంటారని వ్యంగ్యంగా మాట్లాడారు.

మాట్లాడుతున్న రంజిత్‌రెడ్డి

బొత్స కరెంట్‌ బిల్లు కట్టలేదేమో.. అందుకే కట్ చేసినట్లు ఉన్నారు. తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్‌ పోదు. అరగంట లేకపోతే మనం తట్టుకోలేక పోతున్నాం. అప్పుడు ఏం ఉన్నాయో.. ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసు. హైదరాబాద్​లో మంచిగుందని మాకు ఫోన్ చేసి అడుగుతున్నరు. హైదరాబాద్‌లో ఉన్న వైకాపా నేతలను అడిగితే నిజం తెలుస్తుంది. జగన్ కుటుంబం ఇక్కడే ఉంటుంది.. వాళ్లను అడిగినా నిజం చెప్తారు. కేసీఆర్ పాలన బాగుందని వైకాపా ఎంపీలే నాతో అన్నారు. మా పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. 2014లో రాష్ట్రం ఏర్పడితే మీకు పాలన చేతగాదు అన్నారు. ఇప్పుడు వాళ్ల ఎంపీలే మమ్మల్ని ప్రశంసిస్తున్నారు. మాకు ఏపీతో పోటీ కానే కాదు. - రంజిత్ రెడ్డి, చెవేళ్ల ఎంపీ

తెలంగాణలో 2 నిమిషాలు కూడా కరెంట్‌ పోవడం లేదని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌లో ఉన్న వైకాపా నేతలను అడిగితే నిజం చెప్తారని ఎద్దేవా చేశారు. జగన్ కుటుంబం కూడా ఇక్కడే ఉంటుంది.. వాళ్లను అడిగినా నిజం చెప్తారన్నారు. కేసీఆర్ పాలన బాగుందని వైకాపా ఎంపీలే నాతో అన్నారని ఎంపీ పేర్కొన్నారు. ఏపీ పథకాలు తెలంగాణలో అమలు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్న ఆయన.. కేసీఆర్ పథకాలను అన్ని రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details