ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చెరుకుపల్లి మాజీ ఎంపీపీ పార్వతి గుండెపోటుతో మృతి - గుంటూరు జిల్లా తాజా వార్తలు

ఆమె ఓ ప్రజా నాయకురాలు. ప్రతి మహిళ ఆత్మగౌరవం నిలపాలని తాపత్రయపడ్డారు. ఏకంగా 21 వేల మరుగుదొడ్లు నిర్మించారు. జాతీయ స్థాయిలో రెండుసార్లు ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డులు అందించారు. ఉత్తమ నేతగా స్థానిక ప్రజల హృదయాల్లో చెరగని స్థానం నిలుపుకున్న ఆమె గుండెపోటుతో కన్నుమూశారు.

cheruku palli mandal former mpp death  in guntur
చెరుకుపల్లి మహిళల ఆత్మగౌరవం నిలిపిన నేత కన్నుమూత

By

Published : Nov 7, 2020, 8:09 PM IST

Updated : Sep 21, 2022, 12:51 PM IST

గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం మాజీ ఎంపీపీ ఎం.పార్వతి (62) గుండెపోటుతో కన్నుమూశారు. జాతీయ స్థాయిలో చెరుకుపల్లికి రెండుసార్లు ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డులు అందించారు. స్థానికంగా 21 వేల మరుగుదొడ్లు కట్టించి బహిరంగ మలమూత్ర విసర్జనరహిత మండలంగా జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిపారు. 2014లో తెదేపా నుంచి చెరుకుపల్లి-2 ఎంపీటీసీగా ఎన్నికైన ఆమె ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, తెదేపా నాయకులు పార్వతి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Last Updated : Sep 21, 2022, 12:51 PM IST

ABOUT THE AUTHOR

...view details