విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. హెచ్‌డీఎస్ రసాయన వాయువును రియాక్టర్‌లోకి పంపుతుండగా రసాయన వాయువు లీక్ అయ్యింది. ఈ ఘటనలో షిఫ్ట్ ఇంఛార్జీ నరేంద్ర, కెమిస్ట్ గౌరీశంకర్ మృతి చెందారు. బాధితులు సూర్యనారాయణ, చంద్రశేఖర్, జానకిరావు, ఆనంద్‌బాబులు గాజువాక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉండడం వల్ల ఆయన్ను కేజీహెచ్‌కు తరలించారు. మృతులు నరేంద్రది గుంటూరు జిల్లా తెనాలి కాగా.. గౌరీశంకర్ విజయనగరానికి చెందినవారు.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్, సీపీ ఆర్కే మీనా ఫార్మా సంస్థను సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, భద్రతా లోపాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలపై ఏమైనా ప్రభావం ఉందా అనేది పరిశీలిస్తున్నారు.