ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: చెత్తకుండీలో పేలుడు..ఒకరికి గాయాలు - hyderabad blast

చెత్తకుండీలో రసాయనిక పదార్థం పేలిన ఘటన సికింద్రాబాద్​ మోండామార్కెట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనలో రాజు అనే వ్యక్తి చేయి విరిగిపోగా.. చికిత్స నిమిత్తం అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

blast in dustbin
చెత్తకుండీలో పేలుడు

By

Published : Oct 25, 2020, 12:13 PM IST

సికింద్రాబాద్​ మోండా మార్కెట్​ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయం వద్దనున్న చెత్తకుండీలో ఒక్కసారిగా రసాయనిక పేలుడు జరిగింది. స్థానికంగా ఉండే రాజు అనే వ్యక్తి చెత్త వేసేందుకు అక్కడికి వచ్చి చెత్తకుండీలో చెేయి పెట్టిన వెంటనే ఒక్కసారిగా పేలుడు జరిగింది.

ప్రమాదంలో రాజు చేయి విరిగిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చెత్త కుండీని పరిశీలిస్తున్నారు. రసాయనిక పదార్థం పేలడంపై ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details