కేబినెట్లో చోటు దక్కించుకున్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇవాళ సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నూతనంగా మరో 28 బీసీ ఉపకులాల కార్పొరేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బేతంచెర్లలోని బీసీ గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా స్థాయి పెంచే దస్త్రంతో పాటు డోన్‌లోని బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా స్థాయి పెంచే దస్త్రంపై ఆయన తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ - ఏపీ మంత్రివర్గ విస్తరణ
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. బేతంచెర్లలోని బీసీ గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా మార్చే దస్త్రంపై తొలి సంతకం చేశారు.
chelluboina venu gopala krishna