హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలో చిరుత సంచారం మరోసారి బయటపడడం వల్ల ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలతోపాటు... జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కాపలాదారులు చిరుత తిరగడాన్ని గమనించినట్లు వెల్లడించారు.
పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... ఒంటరిగా బయటకు రావొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్ వ్యవసాయ క్షేత్రంలో కలకలం రేపిన చిరుత... తప్పించుకుపోయిందని అటవీ, పోలీసు శాఖ భావించినా... జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో సంచరిస్తోందన్న అనుమానం వ్యక్తమవుతోంది. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు మరోసారి రంగంలోకి దిగనున్నారు.