లాక్‌డౌన్ ముగిసిన తర్వాత విమాన సర్వీసులు ప్రారంభించేందుకు హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. కరోనా కారణంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రయాణికులను లోనికి అనుమతించేలా అధికారులు ఏర్పాటు చేశారు. తనిఖీల సమయంలో గుర్తింపు పత్రాలు, ఎయిర్‌టికెట్‌ను భద్రతా సిబ్బంది చేతికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా పరిశీలించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇక మీదట సెక్యూరిటీ సిబ్బంది ఆయా పత్రాలను చేతితో ముట్టుకోకుండా తనిఖీ చేయనున్నారు. ఇందుకుగాను ప్రవేశ ద్వారం వద్ద కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు గుర్తింపు కార్డు, ఎయిర్‌టికెట్‌ను ఆ కెమెరా ముందు ఫ్లాష్ చేయాలి. ఎదురుగా సెక్యూరిటీ పాయింట్‌లో ఉన్న తెరపై ఆయా పత్రాలు కనిపిస్తాయి. వాటిని పరిశీలించి నిర్ధారించుకున్నాక వారిని లోనికి అనుమతిస్తారు.
శరీర ఉష్ణోగ్రత గుర్తించే థర్మల్ కెమెరాలు