ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అశ్లీల వెబ్​సైట్​తో విటులకు వల...3వేల మందికి టోపీ..!

అశ్లీల వెబ్​సైట్​ సృష్టించారు... అమ్మాయిలను ఎరగా చూపుతూ విటులను ఆకర్షించటం మొదలుపెట్టారు. ఇలా మూడేళ్ల కాలంలో ఒకరు కాదు.. ఇద్దరూ కాదు ఎకంగా... 3వేల మంది నుంచి డబ్బులు లాగారు. ఆన్​లైన్​ ద్వారా రూ. 60 లక్షలను దోచేశారు ఈ అశ్లీల వెబ్​సైట్​ సృష్టికర్తలు. ఓ ఎన్​ఆర్​ఐ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టగా.. ఈ ఆన్​లైన్​ మోసం వెలుగు చూసింది.

Cheating
Cheating

By

Published : Aug 16, 2020, 8:12 PM IST

Updated : Aug 16, 2020, 9:07 PM IST

అశ్లీల వెబ్​సైట్​ ద్వారా విటులకు గాలం వేస్తూ లక్షల రూపాయలు కాజేస్తున్న కేటుగాళ్లను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్ల కాలంలో ఆన్​లైన్​ ద్వారా రూ. 60 లక్షలు టోపీ పెట్టినట్లు విచారణలో తేలింది. ఓ ఎన్​ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదు​తో విచారణ చేపట్టిన పోలీసులు...అశ్వనీకుమార్​ రాజా, సింధు అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అశ్వనీకుమార్@జంషెడ్​పూర్....

అశ్వనీకుమార్ రాజు... జంషెడ్​పూర్​లో సాధారణ మెకానిక్. 11 ఏళ్ల క్రితం భార్య పిల్లలతో విజయనగరం వలస వచ్చాడు. స్థిరాస్తి వ్యాపారం పేరుతో భర్తతో విడిపోయిన సింధు​ అనే మహిళతో అక్రమ సంబంధం ఏర్పర్చుకున్నాడు. ఈ క్రమంలో విలాసవంతమైన జీవితం కోసం ఈజీ మనీపై దృష్టి సారించాడు. ప్రియురాలు సింధుతో కలిసి.. అంతర్జాలంలో అశ్లీల వెబ్​సైట్​ను సృష్టించారు.

లోకాంటో యాప్

ఈజీ మనీ కోసం లోకాంటో యాప్​ రూపొందించారు. ఆన్​లైన్​ వేదికగా నడిచే ఈ యాప్ ద్వారా మోసం చేయటం ప్రారంభించారు. వీరికి పరిచయం ఉన్న వారిని అందులో ఉంచి...ఆడవాళ్లు మగవాళ్లుగా.... మగవాళ్లు ఆడవాళ్లుగా మాట్లాడుతారు. ఎవరు ఎవర్ని కలుసుకునేది ఉండదు. కేవలం మాటలు...డబ్బులు వేయడం వంటి మాత్రమే జరుగుతాయి. ఇలా అమాయకులను ట్రాప్​ చేసి...డబ్బులు పడగానే సెల్​ఫోన్​ స్విచ్ఛాప్ చేస్తారు.

ఎన్​ఆర్​ఐ ఫిర్యాదుతో....

ఈ వలపు వల వ్యవహారంలో ఓ ఎన్​ఆర్​ఐ చిక్కిపోయాడు. తాను మోసపోయానని నిర్ధరించుకున్న బాధితుడు...పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. విచారణ చేపట్టిన పోలీసులు...ఈ ఆన్​లైన్​ దందాను బయటపెట్టారు.

ఇదీ చదవండి

వారం తర్వాతే రష్యా వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగం!

Last Updated : Aug 16, 2020, 9:07 PM IST

ABOUT THE AUTHOR

...view details