TSRTC CHARGES: ప్రజారవాణా సామాన్య ప్రజలపై మరోసారి భారం మోపింది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలను మళ్లీ పెంచింది. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఇదివరకే చిల్లర సమస్య తీర్చేందుకు రౌండప్ పేరిట ఛార్జీలను ఆర్టీసీ సవరించింది.
TSRTC CHARGES HIKED AGAIN: తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు - టీఎస్ఆర్టీసీ ఛార్జీలు
తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ప్యాసింజర్స్ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. పెరిగిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
1
ప్యాసింజర్స్ సెస్ పేరిట ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ.5 పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ.10 వరకు ఛార్జీలను పెంచినట్లు వెల్లడించారు. అయితే అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి:Student Letter to Teachers: మద్యం తాగుతా.. సిగరెట్ కాలుస్తా..!