గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంపికకు ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలో మార్పులు చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీలో ఉపాధ్యక్షులుగా జేసీలకు చోటు కల్పించారు. జిల్లా కమిటీలో రైతు భరోసా, రెవెన్యూ జేసీలకు స్థానం చేకూర్చారు. జిల్లా ఎంపిక కమిటీలో సభ్యుడిగా సంక్షేమ బాధ్యతలు చూసేలా మరో జేసీని నియమించనున్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులను కూడా జిల్లా ఎంపిక కమిటీలో నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువబడ్డాయి. ఈ కమిటీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరీక్షలను పర్యవేక్షించనుంది.
సచివాలయ ఉద్యోగుల ఎంపిక జిల్లా కమిటీలో మార్పులు - ఏపీలో సచివాలయాలు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఎంపికకు జిల్లా కమిటీలో మార్పులు చేపట్టారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Changes in the District Committee