ఆర్టీసీ సిబ్బంది ఏళ్ల తరబడి వినియోగిస్తున్న ఖాకీ దుస్తుల స్థానంలో లేత నీలిరంగు దుస్తులను ప్రవేశపెట్టనున్నామని సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. శుక్రవారం విశాఖలోని వాల్తేరు డిపోలో... మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడే చిత్రాలతో నవీకరించిన బస్సులను ఆయన ప్రారంభించారు. అన్ని జిల్లాల నుంచి విశాఖకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా రాత్రి వేళల్లో డాల్ఫిన్ క్రూయిజ్ అనే కొత్త బస్సులను నడుపుతామని తెలిపారు. ప్రస్తుతానికి 18 బస్సులను కొన్నామని వివరించారు. మార్చి రెండో వారం నుంచి ఈ బస్సుల సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఇదిలా ఉండగా గతంలో మాదిరి ఆర్టీసీ అంటే గుర్తుకొచ్చే రంగులు కాకుండా 13 జిల్లాల్లోని ప్రసిద్ధ ప్రాంతాలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రకారులతో బస్సులపై బొమ్మలు వేయిస్తున్నారు.
ఏపీఎస్‌ఆర్టీసీకి ‘స్మార్ట్ మొబిలిటీ ప్రాజెక్టు’ అవార్డు