రాష్ట్రంలో లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకు వేళలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఖాతాదారులకు పలు సూచనలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఏటీఎంలు అన్ని పని చేస్తాయని స్పష్టం చేసింది. సున్నిత ప్రాంతాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఉన్న బ్యాంకులను మూసివేస్తామని తెలిపింది. ఖాతాదారులు డిజిటల్ చెల్లింపుల సేవలను వినియోగించుకోవాలని కోరింది. కొత్త ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు వంటి సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా ఎఫెక్ట్: మధ్యాహ్నం వరకే బ్యాంకుల సేవలు: ఎస్ఎల్బీసీ - రాష్ట్రంలో బ్యాంకుల పని వేళల మార్పు
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలలో మార్పులు చేశారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు సేవలందించనున్నాయి.
changes banking hours in ap over lockdown