రాష్ట్రీయ లోక్ దళ్ చీఫ్ అజిత్ సింగ్ కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆయన గురువారం ప్రాణాలు కోల్పోయారు. అజిత్‌సింగ్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. అజిత్‌సింగ్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రిగా ఎనలేని సేవలందించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. అజిత్‌సింగ్ సంస్కరణలు రైతులకు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. సామాజిక, ఆర్థిక సమానత్వానికి అజిత్‌సింగ్ కృషి అజరామరం అని చంద్రబాబు కొనియాడారు.
అజిత్‌సింగ్ మృతి పట్ల చంద్రబాబు సంతాపం - ఏపీ తాజా వార్తలు
ఆర్ఎల్డీ పార్టీ అధినేత అజిత్ సింగ్ కరోనాతో మృతి చెందడం పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
babu