ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణకు తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన నటనతో ఆరు దశాబ్దాల పాటు సినీ ప్రేక్షకులను మెప్పించి.. నవరస నటనా సార్వభౌముడిగా కీర్తించబడ్డారని చంద్రబాబు కొనియాడారు. కైకాల సంపూర్ణ ఆయురారోగ్యం, ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నానన్నారు.
కైకాల సత్యనారాయణ ఆరు దశాబ్దాల వెండితెర వైభవానికి ప్రతీక అని నారా లోకేశ్ కీర్తించారు. తెదేపా మాజీ ఎంపీగానూ ఆయన ప్రజలకు చేసిన సేవ మరపురానిదని కొనియాడారు. ఆయన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.