తన ఇంటికి దండయాత్రగా వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును పోలీసులెలా సమర్థిస్తారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిలదీశారు. తమ నైతికతను పోలీసులు ప్రశ్నించుకోవాలని హితవు పలికారు. ఇటీవల దుండగుల దాడిలో గాయపడి విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి దళిత ఐకాస నేత పులిచిన్నాను.. చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు.
CBN: తప్పుడు కేసులకు భయపడేది లేదు: చంద్రబాబు - vijayawada latest news
ఇటీవల దుండగుల దాడిలో గాయపడి విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి దళిత ఐకాస నేత పులి చిన్నాను చంద్రబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును పోలీసులెలా సమర్థిస్తారని మండిపడ్డారు.
పులిచిన్నాను పరామర్శించిన చంద్రబాబు నాయుడు
పోలీసులు పెట్టే తప్పుడు కేసులకు భయపడేది లేదన్న బాబు... చట్టప్రకారం పనిచేసే పోలీసుల్ని గౌరవిస్తామని.. చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే వారిని చట్టపరంగా శిక్షించే వరకూ వదలిపెట్టమని స్పష్టం చేశారు. వైకాపా నేతలు కూడా ఇక్కడే ఉంటారని... ఆకాశంలో తిరగమనే విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు. 22ఏళ్లు అధికారంలో ఉన్న తెలుగుదేశం ఇలానే చేసి ఉంటే ఒక్క వైకాపా నేత మిగిలేవారు కాదని వ్యాఖ్యానించారు.