అమర్‌నాథ్ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు భక్తుల ఆచూకీ కనిపెట్టి.. వారి యోగ క్షేమాలు చూడాలని కోరుతూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, జమ్ము కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు తెదేపా అధినేత చంద్రబాబు విడివిడిగా లేఖలు రాశారు. అమరేంద్రుడు తెలుగు ప్రజలకు చాలా ప్రసిద్ధి అని.. ఏపీ నుంచి ప్రతి సంవత్సరమూ పెద్ద సంఖ్యలో భక్తులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మరీ.. దర్శనం చేసుకుంటారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఏడాది సైతం అనేక మంది భక్తులు అమర్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటున్నారని తెలిపారు.
అమర్‌నాథ్‌లో ఏపీ యాత్రికుల గల్లంతుపై.. కేంద్రానికి చంద్రబాబు లేఖ - అమర్‌నాథ్‌లో ఏపీ యాత్రికుల గల్లంతుపై చంద్రబాబు లేఖలు
అమర్‌నాథ్‌లో ఏపీ యాత్రికుల ఆచూకీ గల్లంతవడంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి, జమ్ముకశ్మీర్ గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖలు రాశారు. గల్లంతైన వారి ఆచూకీ గుర్తించాలని కోరారు. భక్తుల ఆచూకీ గుర్తించి.. వారు స్వస్థలాలకు చేరుకోవడానికి ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
Chandrababu
అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం వరదల్లో భక్తులు మరణించడం చాలా బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిపోయిన 37 మంది తెలుగు భక్తుల ఆచూకీ తెలియక వారి బంధువులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని.. వారి ఆచూకీ తక్షణమే కనుగొని వైద్య సహాయం, ఆహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. భక్తులు వారి స్వస్థలాలు చేరుకోవడానికి ప్రయాణ ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఇవీ చదవండి:అమర్‌నాథ్ వరదల్లో.. ఆంధ్రావాసి దుర్మరణం