CBN letter to CS: నెల్లూరు జిల్లాలో ఉదయగిరి నారాయణ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ కోరుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పోలీసుల దెబ్బల వల్లే ఎస్సీ యువకుడు నారాయణ చనిపోయాడన్న చంద్రబాబు.. దీనిపై న్యాయ విచారణ కానీ కేంద్ర దర్యాప్తు సంస్థతో గానీ విచారణ జరిపించాలన్నారు. రాజకీయ ప్రత్యర్థులు, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు దౌర్జన్యాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
నారాయణ మృతిపై న్యాయ విచారణ జరిపించాలి.. సీఎస్‌కు చంద్రబాబు లేఖ - cbn news
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. నెల్లూరు జిల్లాలో నారాయణ అనుమానాస్పద మృతిపై.. పొదలకూరు ఎస్ఐ పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని సూచించారు.
ఉదయగిరి నారాయణ మరణం ఓ వర్గం పోలీసుల క్రూరమైన పనితీరుకు నిదర్శనమన్నారు. అధికార పార్టీకి చెందిన వారి ప్రోద్భలంతో.. విచారణ పేరుతో నారాయణను జూన్ 17న కస్టడీకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని మండిపడ్డారు. అనంతరం జూన్ 19న శివార్లలో చెట్టుకు ఉరి వేసుకుని నారాయణ కనిపించాడన్నారు. నారాయణ మృతి కేసులో తదుపరి విచారణ వద్దని ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇందులో పొదలకూరు స్టేషన్ ఎస్సై పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. నారాయణ పోస్ట్‌మార్టం నివేదికను బహిరంగపరచాలన్న చంద్రబాబు… బాధితుల కుటుంబానికి రూ.50 లక్షలు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: