రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతున్న వేళ... ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. జనాభాకు అనుగుణంగా అవసరమైన నిత్యావసర సరుకులను అంచనా వేయడం సహా.. సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన సరుకులను ఒకేసారి గుర్తించి.. వివిధ ప్రాంతాలకు రవాణా చేసేందుకు సిద్ధం చేయాలన్నారు. ట్రక్కులు, లారీల్లో రవాణా చేయబోయే ముందు కరోనా వైరస్ ప్రభావానికి లోనుకాకుండా ప్యాక్ చేయాలన్నారు. పంపిణీ సమయంలో జన గుమికూడకుండా చూడాలని సూచించారు. సరుకుల పంపిణీ తేదీ, సమయాన్ని ప్రభుత్వమే ముందస్తుగా తెలియజేసి ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలన్నారు. పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాల సరఫరా సక్రమంగా జరిగేలా సరైన చర్యలు చేపట్టాలని కోరారు. సేకరణ, రవాణా, పంపిణీ ప్రక్రియలో సిబ్బందికి, ప్రజలకు మధ్య టచ్ పాయింట్లు లేకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని లేఖలో పేర్కొన్నారు.
నిత్యావసరాలు ఇంటింటికీ సరఫరా చేయాలి: చంద్రబాబు - chandrababu naidu latest updates
రాష్ట్రంలో నిత్యావసరాలకు కొరత రాకుండా, వాటి పంపిణీ సమయంలో జనం పెద్ద సంఖ్యలో ఒకేచోట గుమికూడకుండా తగిన చర్యలు చేపట్టాలని నీలం సాహ్నీకి తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. నిత్యావసరాలను ప్రభుత్వమే ఇంటింటికి సరఫరా చేయాలని కోరారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ