ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాజీమంత్రి బొజ్జలకు.. చంద్రబాబు గ్రీటింగ్స్ - బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఆయన నివాసంలో తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. బొజ్జల జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి.. కేక్​ కట్​ చేసి చంద్రబాబు తినిపించారు.

Chandrababu wished Bojjala Gopalakrishna Reddy
మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో చంద్రబాబు

By

Published : Apr 15, 2022, 6:32 PM IST

మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరయ్యారు. హైదరాబాద్​లోని బొజ్జల నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో కేక్ కట్ చేయించి, తినిపించి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన బొజ్జల.. ప్రస్తుతం ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఇంట్లోనే ఉంటున్నారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితిని ఆరాతీసిన బాబు.. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

"తెదేపా పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఆత్మీయులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారిని హైదరాబాద్​లోని ఆయన ఇంట్లో కలిశాను. కొద్దిరోజుల క్రితం తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం ఈ మధ్యనే కుదుటపడి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారాయన. ఈరోజు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపాను. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాను. కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది." - చంద్రబాబు

ఇదీ చదవండి: అమ్మఒడిపై ఆంక్షలు.. మనుగడే ప్రశ్నార్థకం : నారా లోకేశ్​

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details