ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు, రేపు ముంపు గ్రామాల్లో... చంద్రబాబు పర్యటన - వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu: నేడు, రేపు ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఇవాళ కోనసీమ జిల్లాతో పాటు ఈ జిల్లాకు సరిహద్దులో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ముంపునకు గురైన లంక గ్రామాల్లో సిద్ధాంతం నుంచి కరుగోరు మిల్లు చేరుకొని అక్కడ నుంచి గోదావరి మధ్యలో ఉన్న అయోధ్య లంకకు వెళ్లనున్నారు.

cbn
చంద్రబాబు పర్యటన

By

Published : Jul 21, 2022, 7:46 AM IST

Chandrababu: నేడు, రేపు ఉభయగోదావరి జిల్లాల్లోని వరద ముంపు గ్రామాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ కోనసీమ జిల్లాలో వరద ముంపులో ఉన్న అయోధ్యలంకను సందర్శించి అక్కడి నుంచి బోటులో కోనసీమ జిల్లా చాకలి పాలెం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో మానేపల్లి పాలానికి వెళ్తారు. అక్కడ గోదావరిలో ఇద్దరి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం అప్పనపల్లి చేరుకోనున్నారు. అప్పనపల్లిలో వరద బాధిత కుటుంబాలను పరామర్శించి... రోడ్డు మార్గంలో రాజోలు వెళ్లి ఇక్కడ నుంచి రాత్రి 7 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు చేరుకుంటారు.

రేపు యలమంచిలి మండలంలో చంద్రబాబు పర్యటిస్తారు. దొడ్డిబట్ల, అబ్బిరాజుపాలెం, గంగాధరపాలెం, లక్ష్మీపురంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు. నరసాపురం పరిధి పొన్నపల్లిలో చంద్రబాబు పర్యటన ముగియనున్నట్లు తెలిపారు.

కృష్ణా జిల్లాలో తెదేపా బృందం:తెదేపా అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు తెదేపా బృందం... కృష్ణాజిల్లా తెంపల్లి గ్రామంలో పర్యటించనున్నారు. డయేరియా ప్రబలిన తెంపల్లిని నేతలు సందర్శించనున్నారు. తెదేపా బృందంలో గద్దె రామ్మోహన్, కొనకళ్ల నారాయణ, బుద్దా వెంకన్న, బొండా ఉమ తదితర నేతలు ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details