ఏదో ఒక రోజు తాము తిరిగి అధికారంలోకి వస్తామనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు హెచ్చరించారు. ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడు ఇంటి గోడ దూకిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దుందుడుకు చర్యలతో అచ్చెన్నాయుడుని ఉగ్రవాదిలా చూశారని మండిపడ్డారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే అనే విచక్షణ మరిచి, నోటీసు కూడా లేకుండా ఇంటి లోపలి గదుల్లోకి వెళ్లి అమర్యాదగా ప్రవర్తించారన్నారు. మందులు వెంట తీసుకెళ్లాలని కోరినప్పుడు కుటుంబ సభ్యులనూ బెదిరిoచారని ధ్వజమెత్తారు.
అధికారుల వ్యవహారశైలిపై చంద్రబాబు హెచ్చరిక - esi scam in ap
ఏదో ఒక రోజు తాము తిరిగి అధికారంలోకి వస్తామనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు.
chandrababu