ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బాలికపై అత్యాచారం బాధాకరం: చంద్రబాబు - rape attempt on girl in guntoor district news

అత్యాచారానికి గురై గుంటూరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను  చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అత్యాచార ఘటన బాధాకరమన్న ఆయన.. నిందితుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Chandrababu Visitation rape girl at guntoor district hospital
Chandrababu Visitation rape girl at guntoor district hospital

By

Published : Dec 16, 2019, 5:05 PM IST

బాలికపై అత్యాచారం బాధాకరం:చంద్రబాబు
అత్యాచారానికి గురై గుంటూరు సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... బాలికపై అత్యాచారం జరగడం బాధాకరమని అన్నారు. చట్టాలు తేవడమే కాదు..అమల్లోనూ చిత్తశుద్ధి ఉండాలని వ్యాఖ్యానించారు. సీఎం జగన్, అధికారులు వచ్చి బాలికను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని నిలదీశారు. బాలిక కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. బాధితురాలి కుటుంబాన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని...బాలిక చదువు ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details