తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌లో తెదేపా సీనియర్ నేత.. దివంగత నారాయణస్వామి విగ్రహాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. నారాయణస్వామి స్వగ్రామమైన చిన్నచింతకుంట మండలం, అమ్మపూర్ గ్రామంలో తెదేపా ఆధ్వర్యంలో విగ్రహం ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి తెలంగాణ తెదేపా అధ్యక్షులు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ పార్టీ అధికార ప్రతినిధులు కొత్తకోట దయాకర్‌రెడ్డి, బక్కని నర్సింహులు, సీతా దయాకర్ రెడ్డి, నారాయణస్వామి కుటుంబ సభ్యులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.