'మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలి' - cows death
విజయవాడలో హృదయవిదారక ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వంద గోవులు మృత్యువాత పడటంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసు దర్యాప్తును త్వరగా పూర్తి చేసి.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
!['మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4100954-815-4100954-1565451734584.jpg)
'మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలి'
విజయవాడ తాడేపల్లి గోసంరక్షణ సంఘం గోశాలలో ఆవుల మృతిపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్విట్టర్లో స్పందించారు. ఘటన ప్రమాదవశాత్తు జరిగిందని అనుకోవటం లేదని అన్నారు. రాత్రికి రాత్రే అలా జరగటం వెనక.. మరో కుట్ర ఉండవచ్చుననే అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం త్వరగా దర్యాప్తు పూర్తి చేసి.. మూగజీవాలను బలిగొన్నవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.