పాలసీ పేరుతో వైకాపా మాఫియా... దోపిడీ... అరాచకాలు శృతిమించుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇసుక పాలసీ అయినా... మద్యం పాలసీ అయినా దోచుకోడమే వైకాపా నేతల లక్ష్యమని దుయ్యబట్టారు. దోపిడీపై సామాన్యుడు ప్రశ్నిస్తుంటే... జవాబు చెప్పే ధైర్యం ఉందా అని నిలదీశారు. ఇసుక అక్రమంగా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుంటే... నిరోధించలేకపోతున్నారని ఆక్షేపించారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి అక్రమంగా వస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్‌ను అడ్డుకోలేపోతున్నారని ధ్వజమెత్తారు. నాటుసారా, కల్తీ మద్యం అమ్మకాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారంటూ... ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
'పాలసీ ఏదైనా... దోచుకోవడమే వైకాపా నేతల లక్ష్యం'
ఇసుకైనా... మద్యం పాలసీ అయినా దోచుకోవడమే వైకాపా నేతల లక్ష్యమని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. నాటుసారా, కల్తీ మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేపోతుందంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
chandrababu-tweet-on-ycp-leaders-over-sand-issue