'మడ అడవులను నాశనం చేస్తున్నారు..రక్షించుకుందాం' - కాకినాడ మడ అడవులు వార్తలు
వైకాపా ప్రభుత్వంలో పర్యావరణ పరిరక్షణ కరవైందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తదనంతర పరిణామాలను పట్టించుకోకుండా సీఎం జగన్ ...మడ అడవులను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
'మడ అడవులను నాశనం చేస్తున్నారు..రక్షించుకుందాం'
లక్షల మందిని ప్రభావితం చేసే పరిణామాలను పట్టించుకోకుండా.. సీఎం జగన్ మడ అడవులను నాశనం చేస్తున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. దశాబ్దాలుగా కాకినాడను వరదలు, ఇతర వినాశనం నుంచి మడ అడవులు రక్షించాయన్నారు. పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ...వాటిని పరిరక్షించేందుకు ప్రతిజ్ఞ చేద్దామని చంద్రబాబు పిలుపునిచ్చారు.