Chandrababu on ISB 20th Anniversary: ఐఎస్బీ(ISB) 20వ వార్షికోత్సవానికి హాజరైన ప్రధాని మోదీకి తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 2001లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) ప్రారంభోత్సవానికి నాటి ప్రధాని వాజ్‌పేయి రావడం తనకు మరిచిపోలేని అనుభవమని చంద్రబాబు పేర్కొన్నారు. 90వ దశకంలోనే గచ్చిబౌలి ప్రాంతాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్టుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేసిన్నట్లు చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
ఐఎస్బీని హైదరాబాద్ రప్పించాం.. అది మరిచిపోలేని అనుభవం: చంద్రబాబు - cbn on pm modi
CBN Tweet on ISB 20 years Celebrations: ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) దినదినాభివృద్ధి చెంది భవిష్యత్ బిజినెస్ లీడర్లను అందించాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఐఎస్బీ 20వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
'మహారాష్ట్ర, హరియాణా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు.. స్వరాష్ట్రంలో ఐఎస్బీని ఏర్పాటు చేసుకోవడానికి పోటీపడ్డాయి. ఐఎస్బీ ఎర్పాటుకు హైదరాబాద్‌లో అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పి, ఐఎస్బీ బోర్డును ఒప్పించగలిగాం' అని చంద్రబాబు ఉద్ఘాటించారు. "ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ISB) దినదినాభివృద్ధి చెంది భవిష్యత్ బిజినెస్ లీడర్లను అందించాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు. 2001లో ఐఎస్బీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం నాటి ఫొటోలను ట్వీట్‌కు జోడించారు చంద్రబాబు.
ఇదీ చదవండి: