ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మహానాడు-2020.. దేశంలోనే మొదటి డిజిటల్ రాజకీయ వేడుక' - చంద్రబాబు తాజా వార్తలు

అసంఖ్యాక జనసందోహంలో జరిగే మహానాడు వేడుక... కరోనా కారణంగా డిజిటల్ మహానాడుగా మారిందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో మహానాడు నిర్వహించుకునేందుకు అవకాశం లభించిందన్నారు. డిజిటల్ మహానాడు దేశంలోనే మొదటి డిజిటల్ రాజకీయ సమావేశంగా నిలుస్తుందన్న చంద్రబాబు.... తెలుగు తమ్ములందరూ మహానాడులో పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.

chandrababu
chandrababu

By

Published : May 27, 2020, 10:26 AM IST

చంద్రబాబు ట్వీట్

ఏ సమస్యకైనా సాంకేతిక పరిజ్ఞానం పరిష్కారం చూపుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. లాక్‌డౌన్‌లో భౌతికదూరం పాటిస్తూనే డిజిటల్‌ సోషలైజేషన్‌ దిశగా అడుగులేద్దామన్నారు. ఈసారి జరుగుతున్న డిజిటల్ మహానాడు-2020 కూడా అటువంటిదేనని చంద్రబాబు అన్నారు. ఏటా అసంఖ్యాక జనసందోహం మధ్య జరిగే మహానాడు వేడుక .. లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల డిజిటల్ మహానాడుగా మారిందన్నారు. ఈ వేడుక చేసుకునేందుకు జూమ్‌ వెబినార్‌ సాంకేతికత ఓ మార్గం చూపిందన్నారు.

మహానాడు- 2020.. దేశంలోనే మొదటి డిజిటల్ రాజకీయ సమావేశంగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలంతా డిజిటల్‌ మహానాడులో పాల్గొనాలని ట్విట్టర్లో పిలుపిచ్చారు.

ఇదీ చదవండి :చంద్రబాబు నాయుడు, లోకేష్​లపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు

ABOUT THE AUTHOR

...view details