ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సేవ్​ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్... రణన్నినాదం కావాలి' - ఏపీలో మూడు రాజధానుల వార్తలు

మూడు రాజధానుల ప్రతిపాదనపై రాష్ట్రవ్యాప్తంగా  ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.  రాజధానిగా అమరావతి ఉండాలనేదే 13 జిల్లాల ప్రజల అభీష్టమని ట్వీట్ చేశారు.

chandrababu tweet on amaravthi over formers protests
chandrababu tweet on amaravthi over formers protests

By

Published : Jan 6, 2020, 11:46 PM IST

'సేవ్​ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్ రణన్నినాదం కావాలి'

రాజధాని అమరావతి పట్ల రాష్ట్ర ప్రజల్లో ఉన్న భావోద్వేగాలు తనను కదిలించాయని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. రాజధానిగా అమరావతి ఉండాలనేది 13 జిల్లాల ప్రజల అభీష్టమని తెలియజేశారు. అందుకే తెదేపా ఐదేళ్ల పాలనలో వైకాపా అధ్యక్షుడితో సహా ఏ ఒక్కరూ దానిని వ్యతిరేకించలేదని చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల అంశంపై 13 జిల్లాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతకు ఇంతకంటే రుజువేం కావాలని ప్రశ్నించారు. రాజధాని రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని పిలుపునిచ్చారు. ఆడబిడ్డల త్యాగాలు మనందరికీ స్ఫూర్తిదాయకం కావాలని..."సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్" ఐదు కోట్ల ప్రజల రణన్నినాదం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details